జగన్‎కు మరో ఊహించని షాక్.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా

అమరావతి: ప్రతిపక్ష వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో నేతలు ఒక్కరొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. గురువారం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ పదవికి సైతం రిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే వైసీసీ చీఫ్ జగన్‎కు మరో భారీ షాక్ తగిలింది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో పాటు శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు రాజీనామా లేఖలను మరి కాసేపట్లో శాసన మండలి చైర్మన్‎కు అందించనున్నట్లు సమాచారం.  వైసీపీకి నేతలు వరుసగా రాజీనామా చేయడం ఏపీ పాలిటిక్స్‎లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక్కరొక్కరుగా పార్టీ వీడుతుండటంతో వలసల ప్రవాహానికి జగన్ అడ్డుకట్ట ఎలా వేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.