జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో దారుణం జరిగింది. భూవివాదానికి రెండు ప్రాణాలు బలైపోయాయి. కమలాపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పులి లక్ష్మయ్య, గంగయ్య మధ్య కొంతకాలంగా భూమి గెట్ల పంచాయతీ నడుస్తోంది. సాగు భూమి విషయంలో తరచూ గొడవ జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన గంగయ్య భార్య ఆత్మహత్య చేసుకుంది.
తన భార్యను లక్ష్మయ్య కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని భావించిన గంగయ్య.. ఆవేశంతో లక్ష్మయ్య భార్యపై... కల్లు గీసే కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.