రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్

రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్

బచ్చన్నపేట,వెలుగు : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట చెందిన రిటైర్డ్ ​ఎంపీడీవో నల్ల రామకృష్టయ్య హత్య కేసులో మరో ఇద్దరిని సోమవారం అరెస్టు చేసినట్టు నర్మెట సీఐ నాగబాబు తెలిపారు. దీంతో  ప్రధాన నిందితుడైన అంజయ్యతో పాటు ముగ్గురిని అరెస్టు చేసి విచారించారు.

ఇంకో ముగ్గురిని గత నెల 30న అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు ప్లాన్ చేయడమే కాకుండా సహకరించిన పస్తం ధర్మయ్య, పస్తం జగన్నాథంను అరెస్టు చేశారు. రిటైర్డ్ ఎంపీడీవో హత్యకేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీఐ నాగబాబు తెలిపారు.