
బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ఎంపీడీవో నల్ల రామకిష్టయ్య హత్య కేసులో పరారీలో ఉన్న దండుగుల తిరుపతి, దండుగుల రాజును పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. హత్యకు సహకరించిన మరో ఐదుగురిని ఈ మధ్య కాలంలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో అరెస్టుల సంఖ్య పదికి చేరింది.
సుభద్ర హత్య కేసులో..
రిటైర్డ్ ఎంపీడీవో హత్యకు సుపారీ ఇచ్చిన గిరబోయిన అంజయ్య బావమరిది భార్య గంగరబోయిన సుభద్రను నిరుడు అక్టోబర్ 20న హత్య చేశారు. భూమి కోసం సుభద్రను కూడా తానే హత్య చేయించానని విచారణలో అంజయ్య ఒప్పుకున్నాడు. దీనికి అంజయ్య దగ్గర సుపారీ తసుకున్న బుసరాజు రాజేశ్, పల్లపు నవీన్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.