వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు సూపర్

వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు సూపర్

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందించడానికి న్యూ టెక్నాలజీపై బాగా ఫోకస్ పెట్టింది. ఇటీవల వాట్సాప్ ఏఐ చాట్ బాట్  ఫీచర్ ను యాప్ లో అందించింది. దీంట్లో ఏ కొశ్చన్ అడిగినా వాట్సాప్ వెంటనే ఆన్సర్ చేస్తోంది. వాట్సాప్ యూజర్ల ఏఐని బాగా వాడుతున్నారు. పాజిటివ్ టాక్ కూడా వస్తోంది. ఇంతలోనే మరో రెండు అప్ డేట్స్ ఇచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది. వాట్సాప్  యాప్ లో వాయిస్ నోట్స్, వీడియో నోట్స్‌ అనే ఫీచర్లు తీసుకువస్తుంది.

వాయిస్ నోట్స్:

కొత్త వాయిస్ నోట్ ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు నేరుగా చాట్ విండో ద్వారా తమ కాంటాక్ట్‌లకు వాయిస్ నోట్స్‌ను పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్న వాయిస్ నోట్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్ కమ్యూనికేషన్‌ను ఈసీ చేయడానికి రూపొందించబడింది.

వీడియో నోట్స్: 

వాయిస్ నోట్స్‌తో పాటు వీడియో నోట్స్‌ను పంపే సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్ Android వెర్షన్ 2.24.14.14లో అందుబాటులో ఉంటుంది. ఇది ప్రస్తుతం బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. వీడియో నోట్ ఫీచర్ చిన్న వీడియో క్లిప్ లను పంపడానికి ఉపయోగపడుతుంది. వీడియో నోట్ ద్వారా తీసిన వీడియో క్లిప్ గ్రూప్‌లు, ఇండివిజువల్ కాంటాక్ట్‌లకు ఫార్వార్డ్  చేసుకోవచ్చు.