ఎల్​ఐసీ నుంచి మరో రెండు ప్లాన్లు

హైదరాబాద్​, వెలుగు : ఎల్ఐసీ కొత్తగా యువ, యువ క్రెడిట్​ లైఫ్​ టర్మ్ ​ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. మొదటి ప్లాన్​  ఆన్​లైన్, ఆఫ్​లైన్​లో లభిస్తుంది. యుక్త వయసులోనే బీమా తీసుకోవాలనేకునే వారి కోసం దీనిని తీసుకొచ్చామని ఎల్​ఐసీ తెలిపింది. యువ క్రెడిట్​టర్మ్​ప్లాన్​  మాత్రం ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటుంది.

ఇవి రెండు నాన్​ లింక్డ్​, ఇండివిడ్యువల్​, రిస్క్​ప్లాన్లు. పాలసీహోల్డర్​మరణిస్తే నామినీలకు పరిహారం లభిస్తుంది. వీటికి కనిష్ట వయసు 18 ఏళ్లు కాగా (యువ క్రెడిట్​లైఫ్​కు 23 ఏళ్లు), గరిష్ట వయసు 45 ఏళ్లు. కనిష్ట నష్టపరిహారం రూ.50 లక్షలు కాగా, గరిష్ట పరిహారం రూ.ఐదు కోట్లు.