ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది? అంటే.. వెంటనే ‘ఎవరెస్ట్’ అని చెప్పేస్తారు. కానీ.. భూమ్మీద అంతకంటే ఎన్నో రెట్లు ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి. కాకపోతే.. అవి ఎక్కువభాగం భూమిలో పాతుకుపోయి ఉండడం వల్ల బయటికి ఎత్తుగా కనిపించడం లేదు.
ఎవరెస్ట్ పర్వతం కంటే సుమారు 100 రెట్లు ఎత్తైన రెండు పర్వతాలను ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం మధ్య సరిహద్దుల్లో కనుగొన్నారు. నేచర్ జర్నల్‌లో పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ ద్వారా ఈ విషయం తెలిసింది.
ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8.8 కి.మీ మాత్రమే. కానీ.. ఈ పర్వతాల ఎత్తు దాదాపు 1,000 కి.మీ. ఉంటుందని సైంటిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. వాటి వయసు కనీసం అర బిలియన్ సంవత్సరాలు ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.