Asteroid threat:నాసా అలర్ట్ : బస్సు, విమానం సైజుల్లో భూమివైపు రెండు గ్రహశకలాలు

Asteroid threat:నాసా అలర్ట్ : బస్సు, విమానం సైజుల్లో భూమివైపు రెండు గ్రహశకలాలు

భూగ్రహానికి మరో ముప్పు రాబోతుందా..? రెండు ఆస్ట్రాయిడ్స్ భూమికి దగ్గరగా రాబోతున్నాయని సోమవారం నాసా హెచ్చరించింది. రేపు (సెప్టెంబర్ 24)న భూమిపై నుంచి 2020 GE, 2024 RO11 అనే రెండు గ్రహశకలాలు ప్రయాచనున్నాయని నాసా ప్రకటించింది. 2020 GE ఆస్ట్రాయిడ్ సుమారు26 అడుగుల వ్యాసం, అంటే.. ఒక బస్సు పరిమాణంలో ఉంటుంది. ఇది భూమికి 4లక్షల10 వేల మైళ్ల దగ్గరగా వెళ్తోంది.

2024 RO11 గ్రహశకలం120 అడుగుల వ్యాసంతో విమానం అంత సైజ్ లో ఉంటుంది. ఇది భూమికి 4,580,000 మైళ్ల సేవ్ సైడ్ డిస్టెన్స్ లో ప్రయాణిస్తుంది. ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని సెంటిస్టులు చెప్తున్నారు. కానీ స్పెయిస్ లో ఏ క్షణం ఏం అయినా జరగొచ్చు. అందుకే నాసా ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ గురించి సైంటిస్టులను అలర్ట్ చేసింది. సెప్టెంబర్ 24న ఈ రెండు గ్రహశకలాలు భూమిని దాటబోతున్నాయని NASA యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ వెల్లడించింది.
 

ఆకాశంలో మంగళవారం స్పెషల్ టెలిస్కోప్‌లతో ఈ ఆస్ట్రాయిడ్స్ ను చూడవచ్చు. అంతేకాదు సెప్టెంబర్ 25న 2024 RK7 అనే మరో ఆస్ట్రాయిడ్ కూడా భూమి దూరంగా వెళ్తొందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది 100 అడుగుల వ్యాసంతో ఉంది.

 

2024 సెప్టెంబర్ 15నాడే 2024 ON అనే ఆస్ట్రాయిడ్ భూమికి 620,000 మైళ్ల దూరంలో ప్రయాణించింది. ఇది 720 అడుగులు వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం భూమిని తాకితే.. భారీగా నష్టం జరిగేది. అదృష్టశాత్తువా ఎలాంటి ప్రమాదం జరగలేదు.