![సింగరేణిలో కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు](https://static.v6velugu.com/uploads/2025/02/two-new-directors-took-charge-at-singareni_aE1DxdF97u.jpg)
- ఆపరేషన్స్,ప్రాజెక్ట్స్అండ్ప్లానింగ్విభాగాల్లో నియామకం
- హైదరాబాద్ సింగరేణి భవన్ లో చార్జ్ తీసుకున్న డైరెక్టర్లు
గోదావరిఖని / కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు సోమవారం హైదరాబాద్‌సింగరేణి భవన్లో చార్జ్తీసుకున్నారు. ఆపరేషన్స్విభాగం డైరెక్టర్‌గా అడ్రియాల లాంగ్వాల్ప్రాజెక్ట్(ఏఎల్పీ) జనరల్మేనేజర్కొప్పుల వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్స్అండ్ ప్లానింగ్విభాగం డైరెక్టర్‌గా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ఎల్వీ సూర్యనారాయణను నియమితులయ్యారు. మణుగూరు ఏరియాలో వెంకటేశ్వర్లు జేఎంఈటీగా చేరి రామగుండం, మందమర్రి, కొత్తగూడెం తదితర ఏరియాల్లో ఓవర్‌మెన్‌గా, అండర్మేనేజర్గా, మేనేజర్‌గా, సేఫ్టీ ఆఫీసర్‌గా, ఏజంట్‌గా విధులు నిర్వహించారు.
ప్రస్తుతం సింగరేణిలో ప్రతిష్టాత్మకమైన అడ్రియాల లాంగ్వాల్ప్రాజెక్ట్కు జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. అలాగే ఎల్ వీ సూర్యనారాయణ కూడా వివిధ హోదాల్లో పనిచేసి రామగుండం – 2 , శ్రీరాంపూర్ఏరియాలకు జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. కొత్తగా డైరెక్టర్ల ఎంపిక చేపట్టగా.. పది మంది జనరల్మేనేజర్లు అటెండ్కాగా ఇంటర్వ్యూ కమిటీ ప్రతిభ ఆధారంగా ఇద్దరిని ఎంపిక చేసింది. కాగా ఈనెల1 వరకు ఆపరేషన్స్ డైరెక్టర్ ఎన్వీకె శ్రీనివాస్, ప్రాజెక్ట్ అండ్ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో పొడిగింపు ఇవ్వలేదు. కొత్తవారికి చాన్స్ ఇచ్చారు. కొత్త డైరెక్టర్లను మినిమమ్వేజ్అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ సింగరేణి భవన్లో కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
వెంకటేశ్వరరెడ్డి వీఆర్ఎస్కు అప్లై
భద్రాద్రి కొత్తగూడెం : ప్రాజెక్ట్, ప్లానింగ్(పీపీ) డైరెక్టర్‌గా రెండేండ్ల పాటు కొనసాగిన జి. వెంకటేశ్వరరెడ్డి వీఆర్ఎస్కు అప్లై చేశారు. డైరెక్టర్పీపీతో పాటు అదనంగా డైరెక్టర్‌గానూ బాధ్యతలు చేపట్టగా.. గత నెల 31తో పదవీ కాలం ముగిసింది. సోమవారం కొత్త డైరెక్టర్లు ఎంపిక చేయడంతో ఆయన జీఎంగా పని చేయాల్సి ఉండడంతో మనస్తాపం చెంది వీఆర్ఎస్ కోరుతూ కంపెనీ లెటర్ రాశారు.
డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పని చేసిన శ్రీనివాస్‌ను ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లతో పాటు యాజమాన్యం ఆదేశాల ధిక్కరణ వంటి కారణాలతో డైరెక్టర్ పోస్టు నుంచి హోల్డ్‌లో పెట్టారు. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. ఏఎల్పీ జీఎం, మార్కెటింగ్ జీఎంగా కానీ, ఆయనకు చాన్స్ ఉన్నట్టు కంపెనీలో చర్చ నడుస్తోంది.