
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో ఇద్దరు అధికారులను ఈవో విజయ రామారావు సస్పెండ్ చేశారు. లడ్డు, పులిహోర స్టోర్ ఇన్ఛార్జ్, టికెట్ కౌంటర్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో. ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆలయ ఈవో.
బాసర ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల్లో గోల్ మాల్ చేస్తూ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గ్రామస్థుల ఫిర్యాదుతో టికెట్ కౌంటర్లను పరిశీలించారు ఆలయ ఈఓ. కౌంటర్లలో చింపని టికెట్లను గుర్తించారు. వీటి ఆధారంగానే ప్రసాదాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. గ్రామ పూజలో పాల్గొన్న పులిహోర బండిలో 690 ప్యాకెట్లు ఉండగా రిజిస్టర్ బుక్ లో మాత్రం 350 నమోదు చేశారు. అమ్మవారి ప్రసాదంలో చేతివాటం ప్రదర్శించడంపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.