ఈ విషయం తెలిస్తే రోజుకు 3 కప్పుల కాఫీ కచ్చితంగా తాగుతారేమో..!

ఈ విషయం తెలిస్తే రోజుకు 3 కప్పుల కాఫీ కచ్చితంగా తాగుతారేమో..!
  • రోజుకు 3 కప్పుల కాఫీతో గుండె జబ్బులు దూరం
  • చైనా వర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి

న్యూఢిల్లీ: రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా టీ తీసుకునే వారికి మధుమేహం సహా హృద్రోగాలకు కారణమయ్యే జబ్బుల ముప్పు తగ్గుతుందని తాజా పరిశోధనలలో వెల్లడైంది. కాఫీ, టీలలోని కెఫైన్ వల్ల గుండె పదిలంగా ఉంటుందని తేలింది. మూడు కప్పుల కాఫీలతో శరీరంలోకి 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫెన్ చేరుతుంది. కెఫైన్ ఉన్న ఉత్పత్తులు (చాక్లెట్లు, కొన్న రకాల ఎనర్జీ డ్రింకులు, స్నాక్ బార్స్) ఏవి తీసుకున్నా సరే మొత్తంగా రోజుకు 300 మిల్లీ గ్రాములు శరీరంలోకి చేరేలా చూసుకుంటే గుండె జబ్బుల రిస్క్ 40 నుంచి 48 శాతం తగ్గుతుందని చైనాకు చెందిన షుజౌ మెడికల్ కాలేజీ సూషౌ యూనివర్సిటీ సైంటిస్టులు  చెప్పారు. 

ఈ మేరకు యూకో బయోబ్యాంక్ డాటా నుంచి లక్షలాది వ్యక్తుల వివరాలను సేకరించి, పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించామన్నారు. ఇందులో 1.72 లక్షల మంది వాలంటీర్లు కాఫీ తాగేవారిని, 1.88 లక్షల మంది కాఫీ, టీ రెండూ తాగేవారిని పరీక్షించి చూశామన్నారు. కెఫైన్ తీసుకోని వారు, రోజుకు కేవలం వంద మిల్లీగ్రాములు మాత్రమే తీసుకునేవారితో పోలిస్తే రోజుకు 300 గ్రాముల కెఫైన్ తీసుకునేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని వర్సిటీ సైంటిస్టులు తెలిపారు. కాగా, ఈ స్టడీ ఫలితాలను క్లినికల్ ఎండోక్రైనాలజీ, మెటబాలిజం జర్నల్ ప్రచురించింది.