తాజ్ హోటల్‌ను పేల్చివేసేందుకు ఇద్దరు పాకిస్థానీలు ముంబైకి చేరుకుంటారంటూ పోలీసులకు 2023 ఆగస్టు 31 గురువారం రోజున బెదిరింపు కాల్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు సముద్ర మార్గం గుండా భారత భూభాగంలోకి ప్రవేశించి ముంబైలోని తాజ్ హోటల్‌ను పేల్చివేస్తారని వారికి సమాచారం అందించారు. ఫోన్ చేసిన వ్యక్తి తనను ముఖేష్ సింగ్ అని పరిచయం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
దీంతో అలెర్టైన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం శాంతాక్రూజ్‌లో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు చెందిన 35 ఏళ్ల అతడి అసలు పేరు జగదాంబ ప్రసాద్ సింగ్ అని విచారణలో తేలింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌పై 2008లో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే.
ALSO READ:వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. గతంలో ఎప్పుడైనా జరిగాయా .. !
ఈ ఘటనలో హోటల్ నిర్మాణం, పైకప్పు దెబ్బతిన్నాయి. విదేశీయులతో సహా హోటల్లో దిగిన దాదాపు 167 మంది అతిథులు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో చాలా మంది భారతీయులే ఉన్నారు.