అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి

మెంఫిస్ :  అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మెంఫిస్ లో పబ్లిక్ పార్టీ సందర్భంగా భారీ కాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో  ఇద్దరు మరణించ గా, ఆరుగురికి గాయాలయ్యాయి.  శని వారం రాత్రి ఈ ఘటన జరిగింది. అరెంజ్ మౌండ్ పార్క్ లో ఓ పబ్లిక్ పార్టీ జరిగింది. అనుమతి లేని ఈ పార్టీకి 200 నుంచి 300 మంది హాజరయ్యారు.

ఇద్దరు వ్యక్తులు వీరి పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మరో ఆరుగురి కి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరు కున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయని మొదట పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుండగా ఆ సంఖ్యను సవరిం చారు.  కాల్పులు జరగడానికి గల కారణాల ను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.