
హైదరాబాద్ లో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్.. ఇలా అన్నీ ఒకే చోట ఉండటంతో చూడటానికి సరదాగా వెళ్తుంటారు చాలామంది. అయితే చూడటానికి వెళ్లిన వాళ్లు సరదాగా చేసే పనికి కొన్ని సార్లు పెద్ద రిస్క్ లో పడవచ్చు.
తాజాగా తెలంగాణ సెక్రటేరియట్ పై డ్రోన్ ఎగరేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రోన్ ఎగరేసిన ఇద్దరిని శనివారం (మార్చి 15) అరెస్టు చేశారు సైఫాబాద్ పోలీసులు. మార్చ్ 11వ తేదీన రాత్రి తెలంగాణ సెక్రటేరియట్ పై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. గమనించిన SPF పోలీస్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
SPF సిబ్బంది ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. డ్రోన్ ఎగరేసిన వంశీ, నాగరాజు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సెక్రటేరియట్ అవుట్ పోస్ట్ తో పాటు సచివాలయం లాన్ ఏరియా ను డ్రోన్ తో చిత్రీకరించారు పోలీసులు. సెక్రటేరియట్ పై డ్రోన్ ఎగరేయడం వెనుక ఏమైనా రహస్యం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.
ALSO READ | సోషల్ మీడియాలో ఏంటా భాష..? గుడ్డలు ఊడదీసి కొడతాం ఒక్కొక్కరిని: సీఎం రేవంత్