
- మరో ఇద్దరు పరార్
జైపూర్, వెలుగు: దుప్పులను వేటాడి మాంసం అమ్ముతున్న ఇద్దరు వేటగాళ్లు పట్టుబడగా.. మరో ఇద్దరు పారిపోయినట్టు మంచిర్యాల ఎఫ్ఆర్ వో రత్నాకర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి శివారులోని పొలాల సమీపంలో అదే గ్రామానికి చెందిన పాలమాకుల శ్రీనివాస్ రెడ్డి, గూడ పాపన్న మంగళవారం రెండు చుక్కల దుప్పిలను వేటాడారు. బుధవారం వాటి మాంసం అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో వెళ్లి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.
మరో ఇద్దరు వేటగాళ్లు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఎఫ్ఎస్ ఓలు సతీశ్,రామకృష్ణ, ఎఫ్ బీ ఓ అజిత్ ఉన్నారు.