కొండాపూర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌పై నుంచి కిందపడి ఇద్దరి మృతి

 కొండాపూర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌పై నుంచి కిందపడి ఇద్దరి మృతి
  •      కొండాపూర్ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌పై అదుపు తప్పి గోడను ఢీకొట్టిన బైక్‌‌‌‌ 
  •     పైనుంచి కిందపడడంతో యువకులకు తీవ్ర గాయాలు
  •     హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతూ మృతి

గచ్చిబౌలి/మాదాపూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌ పైనుంచి కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్‌‌‌‌లోని కొండాపూర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌పై ఆదివారం జరిగింది. ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన బాల ప్రసన్న (24) బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతుండగా, హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌లో ఉంటున్న మర్రిచెట్టుపాలెం గ్రామానికి చెందిన తన ఫ్రెండ్‌‌‌‌ రోహిత్ (26) సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరు కలిసి బైక్‌‌‌‌పై మజీద్ బండ వైపు నుంచి హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌కు వెళ్తున్నారు. రోహిత్ బైక్‌‌‌‌ నడుపుతుండగా, ప్రసన్న వెనుకాల కుర్చొన్నాడు. కొండాపూర్‌‌‌‌‌‌‌‌లోని బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌పై రోహిత్‌‌‌‌ బైక్‌‌‌‌ను స్పీడ్‌‌‌‌గా డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టారు. దీంతో రోహిత్, ప్రసన్న ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ పైనుంచి కింద రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ప్రసన్నను స్థానికులు కొండాపూర్ జిల్లా ఏరియా ఆసుపత్రికి, రోహిత్‌‌‌‌ను మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. రోహిత్ చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.30, బాల ప్రసన్న 5.18 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. యువకుల మృతదేహాలను పోస్ట్‌‌‌‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రసన్న సోదరుడు ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

బైక్ స్టంట్​లు చేస్తూ మాదాపూర్‌‌‌‌‌‌‌‌లో మరో యువకుడు..

బైక్‌‌‌‌పై విన్యాసాలు చేస్తూ ప్రమాదం జరగడంతో మాదాపూర్‌‌‌‌‌‌‌‌లో ఓ యువకుడు మృతిచెందాడు. కేపీహెచ్‌‌‌‌బీ కాలనీలో నివాసం ఉండే జైస్వామి శంకర్ (24) సికింద్రాబాద్‌‌‌‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌లో సేల్స్ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అదే కాలనీలో నివాసం ఉండే తన ఫ్రెండ్‌‌‌‌ ప్రవీణ్ ప్యారడైజ్ ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌లో ఇన్సూరెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఇద్దరు కలిసి బైక్‌‌‌‌పై టీ తాగేందుకు మాదాపూర్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. అక్కడ టీ దొరక్కపోవడంతో కేపీహెచ్‌‌‌‌బీకి బయలుదేరారు. ఎన్‌‌‌‌ఐఏ ఫైఓవర్‌‌‌‌‌‌‌‌పై ప్రవీణ్ బైక్‌‌‌‌ను డ్రైవ్ చేస్తుండగా శంకర్​ వెనుకాల కుర్చొన్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌‌‌‌ బైక్‌‌‌‌పై విన్యాసాలు చేస్తూ వెళ్తుండడంతో వెనుకాల కూర్చున్న శంకర్‌‌‌‌‌‌‌‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఓ కంటైనర్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌ తలపై నుంచి వెళ్లడంతో, మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌‌‌‌బాడీని పోస్ట్‌‌‌‌మార్టం కోసం గాంధీ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. నిర్లక్ష్యంగా బైక్‌‌‌‌ నడిపిన ప్రవీణ్‌‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు