ఎదురెదురుగా ఢీకొన్న బైకులు.. ఇద్దరు మృతి

  • సూర్యాపేట జిల్లా గుడిబండ శివారులో ఢీకొన్న బైకులు 

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ శివారులో శనివారం రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు చనిపోయారు. కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి కథనం ప్రకా రం.. కోదాడ మండలం తొగర్రాయికి చెందిన కలకొండ సుదర్శన్( 27) బైక్​పై కోదాడ నుంచి తొగర్రాయికి వెళ్తున్నాడు. అదే టైంలో మేళ్లచెరువుకు చెందిన మంగళపల్లి విజయ్ కుమార్(23)  బైక్ పై మేళ్లచెరువు నుంచి కోదాడ పోతున్నాడు. 

వీరిద్దరూ గుదిబండ శివారులోని కాపుగల్లు క్రాస్ రోడ్ వద్దకు రాగానే సుదర్శన్ వేగంగా వచ్చి విజయ్ కుమార్ బైక్ ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో  విజయ్ కుమార్ కిందపడడంతో తలకు బలమైన గాయమై  అక్కడికక్కడే చనిపోయాడు. సుదర్శన్​కు కూడా తలతో పాటు ఇతర చోట్ల గాయాలయ్యాయి. స్థానికులు అతడిని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయ్ కుమార్ బాబాయి మరియదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.