శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై వెళుతున్నారా..? ఇలాంటోళ్లు ఉంటారు.. జాగ్రత్త..!

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై వెళుతున్నారా..? ఇలాంటోళ్లు ఉంటారు.. జాగ్రత్త..!

హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పైన రెండు కార్లతో ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఔటర్ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఇద్దరు యువకులు కార్లతో స్టంట్స్ చేశారు. ఈ ఆకతాయిలను శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటన గురించి.. ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఎగ్జిట్ నెంబర్ 15, 16 మధ్యలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు పైకి చేరుకున్న ఒక బీఎండబ్ల్యూ, ఒక ఫార్చునర్ కారును రౌండ్లు తిప్పుతూ ఇద్దరు యువకులు ప్రమాదకరంగా స్టంట్స్ చేశారు.

ఈ విషయాన్ని గమనించిన ఔటర్ రింగ్ రోడ్డు పెట్రోలింగ్ సిబ్బంది సీసీ కెమెరాల్లో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి బృందం సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించగా రెండు కార్లకు నంబర్ ప్లేట్లు లేకుండా ఈ స్టంట్లు చేసినట్లు తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకులాట సాగించారు. చివరికి నిందితులను హైదరాబాద్లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించారు. 

Also Read :- నీది ఎంత నీచమైన బుద్దో.. నీ మాటలే చెబుతున్నాయి

సోమవారం రోజు(ఫిబ్రవరి 17, 2025) నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వాహనదారులకు, వారి కుటుంబ సభ్యులకు పోలీసుల సూచన చేశారు. ఇంటి నుంచి బయటకు వెళుతున్న పిల్లలు రాత్రి టైంలో బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడకి వెళ్తున్నారో గమనించాలని సూచించారు. ఇలాంటి స్టంట్ల వల్ల ఎదుటి వాహనదారులతో పాటు వీరికి కూడా ముప్పు ఉంటుందని గుర్తుచేశారు. అందువల్ల ఎవరూ కూడా మరోసారి ఇలాంటి స్టంట్స్ చేయొద్దని.. కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు.