2 శాతం మంది ఉద్యోగులు తొలగింపు

వాషింగ్టన్ :  ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో లేఆఫ్స్‌ పర్వం కొనసాగుతున్నవేళ.. మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రముఖ స్పోర్ట్‌ వేర్‌ తయారీ సంస్థ నైక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తొలగింపులు ఉంటాయని వివరించింది. రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. తొలి దశ ఇవాల్టి  ( ఫిబ్రవరి 16) నుంచే ప్రారంభమవుతుందని పేర్కొంది. ఇక రెండో విడత తొలగింపులు నాలుగో త్రైమాసికం చివరి నుంచి ఉంటాయని వెల్లడించింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నైక్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నైక్‌లో 83 వేల 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.