సర్పంచ్​ను వేదికపైకి పిలిస్తే ఇద్దరొచ్చిన్రు

సర్పంచ్​ను వేదికపైకి పిలిస్తే ఇద్దరొచ్చిన్రు

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొ న్న సర్పంచ్, ఇన్ చార్జి సర్పంచ్ భర్తలు

జగిత్యాల, వెలుగు: కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలంటూ అధికారులు సర్పంచ్​ను పిలిచారు. కానీ వేదికపైకి ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. ఇద్దరిలో ఎవరూ సర్పంచ్​ కాదు. కానీ కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్​సరోజ రెండు నెలల కిందట ఫారిన్ వెళ్లడంతో ఆమె బాధ్యతలు ఉప సర్పంచ్ బెజ్జంకి కాంతమ్మకు అప్పగించారు. అప్పటి నుంచి ఇన్​చార్జి సర్పంచ్​గా కాంతమ్మ బాధ్యతలు నిర్వహిస్తోంది. నర్సింగాపూర్, వంజరిపల్లె, టీఆర్ నగర్ కు చెందిన 13 మంది లబ్ధిదారులకు గురువారం జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్ లో చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్​ను స్టేజీ మీదకు వచ్చి లబ్ధిదారులకు చెక్కులు అందించాల్సిందిగా అధికారులు కోరారు. వెంటనే సర్పంచ్  భర్త మల్లారెడ్డి, ఇన్​చార్జి సర్పంచ్​ భర్త చంద్రయ్య వేదికపైకి ఎక్కారు. సర్పంచ్ హోదా కలిగిన ఇద్దరికి బదులు ఎలాంటి అధికారం లేని వారి హస్బెండ్స్ రావడంతో ఏం చేయాలో అర్థంకాక అధికారులు కంగారు పడ్డారు. ఎలాగోలా కార్యక్రమం ముగిద్దామని ఆ ఇద్దరితోనే చెక్కులను ఇప్పించారు.

For More News..

గాంధీయిజం.. ఓ ఇన్‌స్పిరేషన్.. నేడు గాంధీ 151వ జయంతి

మనది మార్పును వ్యతిరేకించే దేశం.. అందుకే బిల్లులపై ఇంత గొడవ

8 శాతం మంది.. 60 శాతం మందికి కరోనా అంటించిన్రు