ఛీటింగ్ చేశారు.. 30 ఏళ్లకు ఏం జరిగిందంటే

నేరం చేసినా.. మోసం చేసినా ఎప్పుడొకప్పుడు బండారం బయట పడుతుంది.  నేర ప్రాంతం నుంచి దూరంగా వెళ్లి బతుకుదామన్న ... పోలీసులు పట్టుకొనేంత వరకు ఊరుకోరు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది.  హైదరాబాద్ లో జనాలను మోసం కేరళకు చెక్కేసిన 30 ఏళ్లలకు  నిఘా వేసి తెలంగాణ సీఐడీ బృందం వారిని కటకటాల్లోకి నెట్టింది.  

అధిక వడ్డీతో మోసం 

మూడు దశాబ్దాలుగా చీటింగ్ కేసుల్లో చిక్కుకుని పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ  పోలీసులు (సీఐడీ)  అరెస్ట్ చేశారు. షెర్లీ టామీ (70), సి. ఐ జాయ్ (67) మరికొంతమందితో కలిసి  ట్రావెన్‌కోర్ ఫైనాన్స్ లీజింగ్ కంపెనీని ప్రారంభించి...అధిక వడ్డీ ఆశచూపి  మభ్యపెడుతూప్రజలను ఆకర్షించారు. ప్రజల నుండి పెద్ద మొత్తంలో వసూలు చేసిన తర్వాత నిందితులు  టామీ , జాయ్‌తో సహా మొత్తం పది మంది కంపెనీ భాగస్వాములు ఆ మొత్తాన్ని దుర్వినియోగం చేసి పెట్టుబడిదారులను మోసగించారని అదనపు డీజీపీ (సిఐడి) మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు.1987 లో బాధితుల ఫిర్యాదు మేరకు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం కేసు నమోదు చేసింది.  అప్పటి నుంచి టామీ, జాయ్ పరారీలో ఉన్నారు.  కేరళలోని ఎర్నాకులంలో నిందితులున్నారని గుర్తించిన ఇన్‌స్పెక్టర్ జె లింగస్వామి, సబ్ ఇన్‌స్పెక్టర్ డి రమేష్ , ఇతర సిబ్బందితో సహా సిఐడి బృందం నిఘా వేసి  వారిని పట్టుకుంది.  నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు.

మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, వారే మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా మోసం చేసే అవకాశం కూడా ఉండకపోలేదు. అలాగని అందరూ మోసం చేస్తారు అని మాత్రం అనుకోకూడదు . ఎదుటివారితో జాగ్రత్తగా ఉండాలి అనేది దీని అర్థం . కాబట్టి ఏ విషయంలోనైనా ముందుగా మనం ఆలోచించి, ఆ తర్వాత ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కటీ నీవే క్షుణ్ణంగా తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, వాటికి అనుగుణంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి, మనంచేసే ఏ పని అయినా సరే మంచిదా.. చెడ్డదా..ఇతరులకు ఎలాంటి నష్టాన్ని కలిగించకుండా ఉండగలిగితేనే ముందడుగు వేయాలి.