సైబర్ మోసం.. లక్ష మాయం

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: సైబర్ నేరగాళ్ల  మోసానికి ఇద్దరు వ్యక్తులు  శనివారం రూ. 1.05లక్షలు పోగొట్టుకున్నారు.   మెదక్​ జిల్లా కౌడిపల్లికి చెందిన మీ సేవ  నిర్వాహకుడు కృష్ణకు ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.  ఫోన్ చేసిన వ్యక్తి  తాను కౌడిపల్లిలో పనిచేసే ఆఫీసర్ ను అని,  తాను అనారోగ్యంతో హాస్పిటల్ లో  ఉన్నానని,  ట్రీట్​మెంట్​ కోసం అర్జంట్ గా రూ.75 వేలు కావాలని అడిగాడు.

అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి కృష్ణ  వెల్మకన్నకు  చెందిన బ్యాంక్ మిత్ర విఠల్, కౌడిపల్లికి చెందిన మరో బ్యాంక్ మిత్ర శ్రీనివాస్ గౌడ్ ఫోన్​ నెంబర్లు ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి విఠల్ కు కాల్ చేయగా అతడు రూ.75 వేలు ఫోన్ పే చేశాడు. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ కు ఫోన్ చేయగా అతడు రూ.30 వేలు ఫోన్ పే చేశాడు.

డబ్బు ట్రాన్స్ ఫర్ చేసిన తర్వాత  సదరు నెంబర్ కు ఫోన్ చేస్తే కలవడం లేదని తెలిపారు.  దీంతో తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయామని లబోదిబో మంటున్నారు.