ఇవాళ ఉదయం ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. రష్యా చేసిన బాంబు దాడిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే యువకుడు మృతి చెందాడు. అయితే ఆ సమయంలో నవీన్ వెంట మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. వారిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి. నవీన్ వెంట ఉన్న ఇద్దరు కూడా హవేరి జిల్లాలోని చలగేరి, రానబెన్నూరు ప్రాంతాలకు చెందినవారని సీఎం బొమ్మై తెలిపారు. ఇప్పటికే నవీన్ తల్లిదండ్రులతో కూడా సీఎం ఫోన్లో మాట్లాడారు. ఆ కుటుంబం తనకు తెలుసన్నారు. వారు తనకు చాలా సన్నిహితులు అన్నారు. ప్రధాని కుటుంబ సభ్యులతో మాట్లాడారని బొమ్మై తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని భారత్‌కు తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. మృతుల కుటుంబం కోలుకునేందుకు సాయం చేయాలని పీఎంవో, ఎంఈఏలను అభ్యర్థించామన్నారు సీఎం.
Two persons were with him (A student who died in Ukraine). One of them also got injured. They are also from Chalageri and Ranebennur taluk of Haveri district: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/b09U8QqEt5
— ANI (@ANI) March 1, 2022
I know his family. They are very close to me. PM had spoken to the family. We will try our best to recover the body and bring it back to India. I have requested PMO and MEA to help us to recover mortals: Karnataka CM Basavaraj Bommai on the death of a Karnataka student in Ukraine pic.twitter.com/uwahJPxpOh
— ANI (@ANI) March 1, 2022