వీడియో : గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు

గాల్లోనే రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక పైలట్ మరణించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..   జూన్ 2నపోర్చుగీస్‌లోని బెజా నగరంలోని  ఎయిర్ బేస్‌లో  యాక్ స్టార్స్  ఏరోబాటిక్  ఎయిర్ షో నిర్వహించింది. కొన్ని విమానాలు ఎయిర్ షోలో పాల్గొన్నాయి. ఇంతలోనే  ఒక విమానం ఒక్కసారిగా పైకి దూసుకెళ్లి మరో విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో రెండు విమానాలు కుప్పకూలాయి. 

ఈ ఘటనలో  స్పానిష్ పైలట్ మరణించగా..పోర్చుగల్ పైలట్ కు గాయాలయ్యాయి.   ప్రమాదం తర్వాత పోర్చుగల్  ఎయిర్‌షోను రద్దు చేశారు.ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోర్చుగల్ రక్షణ శాఖ మంత్రి నునో మెలో  విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామన్నారు.