ఎన్వోసీ కోసం రిటైర్డ్ ఆర్మీ నుంచి లంచం..ఏసీబీకి చిక్కిన ఆఫీసర్లు

ఎన్వోసీ కోసం రిటైర్డ్ ఆర్మీ నుంచి లంచం..ఏసీబీకి చిక్కిన ఆఫీసర్లు
  • పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ నిర్మాణానికి ఎన్‌‌‌‌వోసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌‌‌
  • రూ. 14 వేలు తీసుకుంటూ పట్టుబడిన జనగామ ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఆఫీసర్లు
  • రూ.5 వేలు తీసుకుంటూ చిక్కిన కొండాపూర్‌‌‌‌ విలేజ్‌‌‌‌ సెక్రటరీ

జనగామ, వెలుగు: మాజీ సైనికుడి నుంచి లంచం తీసుకుంటూ జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఆఫీసర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. వరంగల్‌‌‌‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా లింగాల ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం బండ్లగూడెంకు చెందిన మాజీ సైనిక ఉద్యోగి చిర్ర సత్యపాల్‌‌‌‌రెడ్డి భార్యకు నెల్లుట్ల-లింగాల ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ మధ్యలో హెచ్‌‌‌‌పీ పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ సాంక్షన్‌ అయింది. ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ రోడ్డు పక్కన పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ నిర్మాణ పనుల్లో భాగంగా ఎన్‌‌‌‌వోసీ కోసం ఈఈ హుస్సేన్‌‌‌‌ను కలువగా మొదట రూ. 17 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేయగా, చివరకు రూ. 14 వేలకు ఒప్పుకున్నాడు.

 అయితే మహిళ భర్త సత్యపాల్‌‌‌‌రెడ్డి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లోని ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఆఫీస్‌‌‌‌కు వెళ్లిన సత్యపాల్‌‌‌‌రెడ్డిఈఈకి రూ.12 వేలు, ఆయన సూచనతో  అసిస్టెంట్‌‌‌‌ టెక్నికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ రవీందర్‌‌‌‌కు రూ.  2 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇద్దరిని రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఇద్దరిని శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.​

ఓనర్‌‌‌‌ షిప్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ ఇచ్చేందుకు..

కొండాపూర్, వెలుగు : ఓనర్‌‌‌‌ షిప్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ ఇచ్చేందుకు రూ. 5 వేలు లంచం తీసుకున్న విలేజ్‌‌‌‌ సెక్రటరీని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌‌‌కు చెందిన మాచేపల్లి అఫ్సర్‌‌‌‌ ఇటీవల ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన కరెంట్‌‌‌‌ మీటర్‌‌‌‌ మార్చేందుకు ఓనర్‌‌‌‌ షిప్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ అవసరం కావడంతో దాని కోసం విలేజ్‌‌‌‌ సెక్రటరీ షకీల్‌‌‌‌కు అప్లై చేసుకున్నాడు. అప్లికేషన్‌‌‌‌ను నాలుగు నెలలు పెండింగ్‌‌‌‌లో పెట్టిన షకీల్‌‌‌‌ చివరకు రూ. 15 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని చెప్పాడు. 

దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని రూ.5 వేలు ఇస్తానని అఫ్సర్‌‌‌‌ చెప్పడంతో సెక్రటరీ షకీల్‌‌‌‌ అంగీకరించాడు. తర్వాత అఫ్సర్‌‌‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌లో ఉన్న సెక్రటరీ షకీల్‌‌‌‌ వద్దకు వెళ్లి రూ.5 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు షకీల్‌‌‌‌ను రెడ్‌‌‌‌ హ్యాండెండ్‌‌‌‌గా పట్టుకున్నారు.