సెక్రటరీ సంతకం ఫోర్జరీ కేసులో ఇద్దరు రిమాండ్

చౌటుప్పల్ వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పంచాయతీ సెక్రెటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఆ గ్రామ ఉపసర్పంచ్ ఉప్పరబోయిన సంజీవ, రిజిస్ట్రేషన్ కి ప్రయత్నించిన ఏపూరి శివయ్య లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు నారాయణపురం ఎస్సై రాఘవేందర్ తెలిపాడు. 

నారాయణపురం మండల కేంద్రంలో గ్రామకంఠభూమి భూమిని అక్రమంగా వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడానికి నకిలీ స్టాంపు,సెక్రెటరీ సంతకాన్ని పోర్జరి చేశాడని పంచాయతీ సెక్రెటరీ నరేశ్​ ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేసి,పోర్జరికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి శనివారం రిమాండ్ కు తరలించామని ఎస్సై తెలిపాడు.