వరంగల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు గాయాలు

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ దగ్గర కరీంనగర్ –వరంగల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. బస్సులోని 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇద్దరు బస్సు  డ్రైవర్లకు  సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని హుజూరాబాద్, వరంగల్ ఎంజీఎం హాస్పత్రికి తరలించారు.