రెండు బస్సులు ఢీ.. తప్పిన ఘోర ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామం వద్ద  రెండు ఆర్టీసీ బస్సు లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సకాలంలో బ్రేకులు వేయడం వల్ల ప్రమాదం తీవ్రత తగ్గిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని సమాచారం. అయితే బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు  గాయాలయ్యాయి. 
చండురులో నిర్వహించిన తెలంగాణ సమైక్యత వారోత్సవాలకు మహిళలను తరలించిన బస్సును నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ రెండు బస్సులలో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. వేగం తగ్గించి వెంటనే బ్రేకులు వేయడం వల్ల పెనుప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 వాహనాల్లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.