కేరళలో రోడ్డు ప్రమాదం..టూరిస్ట్ బస్, కారు ఢీ..ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు

కేరళలో రోడ్డు ప్రమాదం..టూరిస్ట్ బస్, కారు ఢీ..ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..టూరిస్ట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  

ఈ ప్రమాదం శనివారం ( జనవరి 4, 2025) అర్థరాత్రి 11.30 సమయంలో కొల్లాం జిల్లా  చడియమంగళం సమీపంలోన నెట్టతార వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. 

మహారాష్ట్ర రిజిస్టర్  కారులో తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం శబరి మళకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులిద్దరు శరవణన్(30), షణ్ముగ(70) స్పాట్ లో నే చనిపోయారు. వీరిద్దరు నాగర్ కోయిల్ కు చెందినవారుగా గుర్తించారు. 

ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు గాయపడ్డారు..వీరిలో ఇద్దర చిన్న పిల్లలు ఉ న్నారు. తీవ్రగాయాలైన వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

టూరిస్టు బస్సును ఢీకొట్టిన సమయంలో కారు రాంగ్ రూట్ లో ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారిన టూరిస్టు బస్సు డ్రైవర్ స్పష్టం చేశారు.