పుష్ప నుంచి రెండు సీన్లు లీక్..ఎవరి పని?

భారీ సినిమాలకు  లీకుల బెడద తప్పడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లోని సీన్లు లీకవ్వడం  మామూలైపోయింది. కొన్ని సార్లు బయట వారు ఈ పని చేస్తుంటే..ఒక్కోసారి  మూవీ టీంలో వాళ్లే  ఈ పని చేస్తుంటారు. అయితే సినిమా షూటింగ్ అవుతున్నప్పడు సీన్లు లీక్ అయితే మాత్రం అది టీం వాళ్ల పనే అని చెప్పవచ్చు. లేటెస్ట్ గా అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప సినిమాలో ఒకే సారి రెండు సీన్లు లీవ్వడం కలకల రేపుతోంది. ఒకటి అల్లు అర్జున్ ,హీరోయిన్ రష్మిక మందన్న మధ్య వచ్చే సాంగ్, ఇంకోటి పోలీసులకు అల్లు అర్జున్ కు వచ్చే ఫైట్ సీన్ . ఈ సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ కు వచ్చిన జనం ఎవరైనా తీసి లీక్ చేశారా? ఎలా లీకైందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

SEE MORE NEWS

తాగిన మైకంలో కన్నబిడ్డనే చంపేసింది

ట్రెండింగ్.. రైతులకు మద్దతుగా పోర్న్‌స్టార్..

ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు

ధరణి వల్ల ఇబ్బందులు వాస్తవం..