ఇస్లామాబాద్: పాక్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో18 మంది మృతి చెందారు. తూర్పు పాకిస్తాన్లో హైవేపై వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో దాదాపు 10 మంది చనిపోయారు. మరో ఘటనలో హైవేపై వెళ్తున్న ట్రక్కును ప్యాసింజర్ వ్యాన్ ఢీకొట్టడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో నౌషాహ్రో ఫిరోజ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ల నిర్లక్ష్యమే రెండు ప్రమాదాలకు కారణమని అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫతేజంగ్ సిటీలో జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.