జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కలకు రెండు షెలర్ట్​ హోంలు

  •     సీనియర్ ఆఫీసర్లు, బ్లూక్రాస్‌‌‌‌‌‌‌‌ సభ్యులతో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ
  •     కుక్కల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి
  •     ఉన్నతాధికారుల సమీక్షలో మున్సిపల్ ​ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలో వీధి కుక్కల కోసం ప్రయోగాత్మకంగా రెండు షెల్టర్‌‌‌‌‌‌‌‌ హోంలు ఏర్పాటు చేయాలని మున్సిపల్​ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్ లో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, పశువైద్య శాఖ అధికారులు, బ్లూక్రాస్‌‌‌‌‌‌‌‌, జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల బెడదపై చర్చించారు.

వివిధ శాఖల ఉన్నతాధికారులు, బ్లూక్రాస్‌‌‌‌‌‌‌‌ సభ్యులతో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని దానకిశోర్​తెలిపారు. వీధి కుక్కలను, కుక్కల దాడులను కంట్రోల్​చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కుక్కల ప్రవర్తనపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, స్లమ్ ఏరియా ఫెడరేషన్లకు, స్కూళ్లలో అవగాహన కల్పించేందుకు ఐఈసీ క్యాంపెయిన్ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడీస్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని యూఎల్‌‌‌‌‌‌‌‌బీలలో శానిటరీ జవాన్లు, ఫీల్డ్ శానిటరీ అసిస్టెంట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలు, మదర్స్ గ్రూపులకు వీధి కుక్కల బెడదపై అవగాహన కల్పించేందుకు వచ్చే వారం లోగా శిక్షణ కార్యక్రమాన్ని 
నిర్వహించాలన్నారు. 

సిటీలోని కుక్కల లెక్క తీస్తున్నాం :  ఆమ్రపాలి 

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. సిటీలోని వీధి కుక్కల సర్వేతోపాటు, స్టెరిలైజేషన్ డ్రైవ్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ చేపడుతున్నట్లు తెలిపారు. పెంపుడు కుక్కల నమోదుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను తొలగించామని వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వ్యర్థాలాను సక్రమంగా పారబోసేలా చూస్తున్నామన్నారు. కనస్ట్రక్షన్​సైట్లలో కార్మికుల పిల్లలపై కుక్కల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.

వీధికుక్కలతో ఎదురవుతున్న సవాళ్లను సభ్యులు చర్చించారు. నివారణకు అన్ని శాఖల సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. పెంపుడు కుక్కల యజమానులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. సమావేశంలో సీడీఎంఏ వీపీ గౌతమ్‌‌‌‌‌‌‌‌, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ గోపి, ఎంఏయూడీ అదనపు కార్యదర్శి సైదా, బ్లూక్రాస్‌‌‌‌‌‌‌‌ సొసైటీ ప్రతినిధి అమల అక్కినేని, వెటర్నరీ కాలేజీల డాక్టర్లు, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.