జగిత్యాల జిల్లాలో గంజాయి మిస్సింగ్ కేసులో చర్యలు తీసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు SIలను సస్పెండ్ చేస్తూ మల్టీ జోను 1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 ఫిబ్రవరిలో అంబులెన్స్ లో తరలిస్తున్న 70 కిలోల గంజాయి పట్టుకున్నారు జగిత్యాల జిల్లా పోలీసులు. సీజ్ చేసిన గంజాయిని సారంగపూర్ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. ఇటీవల PS నుండి గంజాయిని చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు.
డ్కూటీలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించి.. జగిత్యాల SP సన్ ప్రీత్ సింగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఇద్దరు SIలను సస్పెండ్ చేశారు ఐజీ రంగనాథ్. గతంలో సారంగపూర్ ఎస్సైగా పనిచేసిన మనోహర్ రావు.. ప్రస్తుత ఎస్సై తిరుపతితో పాటు హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ నరేందర్ లు సస్పెండ్ చేశారు. తర్వాత స్టేషన్ నుండి గంజాయి మాయం చేసిన వారిని గుర్తించారు. సారంగపూర్ మండలానికి చెందిన మైనర్లు పీఎస్ లో గంజాయి చోరీ చేసినట్లు సమాచారం.