ఇద్దరు సింగరేణి కార్మికులకు గాయాలు

ఇద్దరు సింగరేణి కార్మికులకు గాయాలు

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి పరిధిలోని ఆర్జీ –1 ఏరియాలోని రెండు గనుల్లో ప్రమాదాలు జరిగి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. జీడీకే–1 సీహెచ్​పీలో వెల్డర్​నారదాసు సిద్ద రామయ్య మంగళవారం బొగ్గు నింపే బంకర్​వద్ద వెల్డింగ్​చేశారు.  అనంతరం దానిని ఆన్​చేయడంతో కుడిచేయి దిమ్మె కింద పడి మూడు వేళ్లు తెగిపోయాయి. వెంటనే అతడిని గోదావరిఖనిలోని సింగరేణి హాస్పిటల్​కు, అక్కడి నుంచి హైదరాబాద్​కు తరలించారు. అదేవిధంగా జీడీకే– 11 గనిలో జనరల్​మజ్దూర్​ కార్మికుడు టి.సతీశ్​ పని స్థలంలో రూప్​బోల్ట్​తాకడంతో కుడి చేయికి గాయమైంది. వెంటనే సింగరేణి హాస్పిటల్​కు తరలించగా ట్రీట్​మెంట్​అందిస్తున్నారు.