ఆస్తి కోసం అన్నను కొట్టి చంపిన చెల్లెళ్లు

ఆస్తి కోసం అన్నను కొట్టి చంపిన చెల్లెళ్లు

మనుషులు రోజు రోజుకు క్రూరంగా మారుతున్నారు. బందాలు, అనుభందాలు ఇవేమీ లెక్కచేయడం లేదు. ఆస్తి కోసం అన్నాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకరినొకరు  కొట్టుకుని చంపుకుంటున్నారు.  లేటెస్ట్ గా ఇద్దరు అక్కాచెల్లెల్లు అన్నను కొట్టి చంపారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.

జగిత్యాల జిల్లా కేంద్రం  పోచమ్మ వాడలో ఆస్తి తగదాలతో అన్నపై ఇద్దరు చెల్లెళ్లు కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన  జంగిలి శ్రీనివాస్ ను ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతున్న శ్రీనవాస్ ఫిబ్రవరి 23న  మృతి చెందాడు.  ఇద్దరు చెల్లెలు శారద, వరలక్ష్మి కర్రలతో దాడి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరు  పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.