
హైదరాబాద్ మియాపూర్ లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. లక్షల్లో జీతం సంపాదిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వేరు వేరు ఘటనల్లో చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఒకరు.. రోడ్డు ప్రమాదంలో అతివేగంతో మరొకరు చనిపోవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ నరసింహారెడ్డి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త సూసైడ్ విషయాన్ని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ | రంగారెడ్డి సింబయాసిస్ వర్శిటీలో లా విద్యార్థి మృతి.. అసలేం జరిగింది.?
మరో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రోషన్ చందానగర్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. చందానగర్ లో ఉంటున్న రోషన్ బైక్ అదుపుతప్పి మరో బైకును ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.