రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్ పూర్ లోని ప్రైమరీ స్కూల్ కు ఇవాళ ఇద్దరే విద్యార్థులు హాజరయ్యారు. వారు కూడా అన్నాదమ్ములే. అయితే టీచర్లందరూ హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్లు ఫోన్లు చేసి పిల్లలను స్కూల్ కు పంపించాలని కోరినా, ఒక్కరూ కూడా స్పందించలేదు. రేపటి నుంచి పంపిస్తామని కొందరు పేరెంట్స్ చెప్పారన్నారు ప్రధానోపాధ్యాయుడు శ్రవణ్ కుమార్.