
- స్కూల్‌కు వెళ్తున్న పదేండ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ.. స్పాట్లోనే దుర్మరణం.. షేక్‌పేటలో ఘటన
- మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో టెన్త్ క్లాస్ బాలుడిని ఢీకొట్టిన టిప్పర్
జూబ్లీహిల్స్/మేడిపల్లి, వెలుగు: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. స్కూల్‌కు వెళ్తున్న పదేండ్ల చిన్నారిని లారీ ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని షేక్‌పేటలో జరిగింది. ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న 14 ఏండ్ల స్టూడెంట్ను టిప్పర్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో చోటు చేసుకున్నది. షేక్‌పేట మైహోం రెయిన్ బో అపార్ట్మెంట్లో ఉండే గడ్డం హేమసుందర్, లక్ష్మీప్రసన్న దంపతుల కూతురు అథర్వి.. మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఐదో తరగతి చదువుతున్నది.
మంగళవారం ఉదయం హేమసుందర్ రోజూలాగే తన బైక్‌పై కూతురును ఎక్కించుకుని స్కూల్‌కు బయల్దేరగా.. షేక్ పేటలోని సీతానగర్ వద్దకు రాగానే.. చక్కెర లోడుతో వెళ్తున్న కేఏ 38ఏ 4195 నంబర్ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో హేమసుందర్, వెనుక కూర్చున్న అథర్వి (10) చెరోవైపు కిందపడిపోయారు. అదే స్పీడ్‌తో లారీ పాపపై నుంచి వెళ్లడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు. అథర్వి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. హేమసుందర్ సొంతూరు వరంగల్ జిల్లా నర్సంపేట. వీ6 న్యూస్ చానల్లో డిజిటల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. ఒక్కగానొక్క కూతురు కండ్ల ముందే చనిపోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరు అవుతున్నది.
ట్యూషన్ నుంచి వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టి..
ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్ను టిప్పర్ ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో జరిగింది. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో ఉండే మోతీరాం కొడుకు తేజ చౌదరి.. నారపల్లి దివ్యానగర్‌లోని నల్లమల్లారెడ్డి స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం తన స్కూటీపై పర్వతాపూర్ స్పాంజిల్లా గ్రేటర్ కమ్యూనిటీలో ట్యూషన్‌కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండ గా కాచవానిసింగారం సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడెన్‌గా యూటర్న్తీసుకోవడంతో తేజ (14) అదుపు తప్పి లారీ కింద పడిపోయాడు. అతనిపై నుంచి టైర్లు వెళ్లడంతో స్పాట్ లోనే చనిపోయాడు. గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి డెడ్‌బాడీని ఫ్యామిలీ మెంబర్లకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.