ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ స్కూల్, కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ వెల్లడించారు.
తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన టెన్త్ క్లాస్ విద్యార్థి మేకర్తి వంశీవర్ధన్, ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్ జంజిరాల అజయ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు హరియాణాలో జరగనున్న నెట్ బాల్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను నెట్ బాల్ జిల్లా అధ్యక్షులు అలిబిన్ అహ్మద్, పీడీ బి.తిరుపతి, టీచర్లు సన్మానించారు.