ఓవర్​స్పీడ్​తో ఢీకొన్న కారు .. బోల్తాపడిన స్కూల్ వ్యాన్​

  • ఒకరు మృతి
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ పిల్లలు 

కమలాపూర్, వెలుగు : హనుమకొండ జిల్లా కమలాపూర్​లో స్కూల్ వ్యాన్​ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. కారులోని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హసన్​పర్తి మండలం పెంబర్తి శివారులోని ఏకశిలా స్కూల్ కు చెందిన వ్యాన్ ​గురువారం సాయంత్రం 30 మంది పిల్లలను వారి ఇండ్లల్లో దించేందుకు బయలుదేరింది. పరకాల–హుజూరాబాద్ మెయిన్ ​రోడ్డుపై ఉమామహేశ్వరి ఫంక్షన్ హాల్ ఎదురుగా యూటర్న్ తీసుకుంటుండగా..హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లికి చెందిన కారు 160 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టింది. 

ఈ ఘటనలో స్కూల్ బస్సు బోల్తా పడగా, కారు నుజ్జునుజ్జయింది. వ్యాన్​లో ఉన్న ముగ్గురు పిల్లలు స్వల్పంగా గాయపడగా..కారులోని ఎండీ అబ్దుల్, భవానంద స్వామి, సంతోష్​లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఎంజీఎంకు తరలిస్తుండగా అబ్దుల్​చనిపోయాడు. భవానంద స్వామి, సంతోష్ చికిత్స పొందుతున్నారు.