- కుత్బుల్లాపూర్‌లోని కంపెనీల్లో మేయర్ ఆకస్మిక తనిఖీలు
- అత్యంత ప్రమాదర పరిస్థితుల్లో స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తింపు
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్పరిధిలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న రెండు స్వీట్స్ తయారీ కంపెనీలను ఫుడ్‌సేఫ్టీ అధికారులు సీజ్‌చేశారు. ఫుడ్కల్తీపై వస్తున్న ఫిర్యాదులకు స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం సాయంత్రం గాజులరామారం సర్కిల్ సూరారంలోని జీపీ ఫుడ్స్, ముత్తు స్వీట్ కంపెనీల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కంపెనీల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి మేయర్కంగుతిన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో స్వీట్స్, ఇతర తినుబండారాలు తయారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్తీ నూనెలు, ఇతర కల్తీ పదార్థాలు, డేంజరస్ఫుడ్కలర్స్వాడుతున్నట్లు గుర్తించారు. ఈ రెండు యూనిట్లలో బాదూషా, బూందీ, కారా, మైసూర్‌పాక్, చెకోడీలు వంటి ఫుడ్ఐటమ్స్తయారు చేసి గ్రేటర్‌పరిధిలోని కిరాణా షాపులకు సప్లయ్చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే రెండు కంపెనీలను సీజ్చేయించారు. అనంతరం మేయర్విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజారోగ్యమే లక్ష్యంగా తాము తనిఖీలు చేస్తునట్లు తెలిపారు. కేవలం హోటల్స్ పైనే కాకుండా ఫుడ్ఐటమ్స్తయారు చేసే అన్ని రకాల యూనిట్లలో తనిఖీలు చేస్తున్నామన్నారు. కల్తీ ఫుడ్ కు సంబంధించి ఫిర్యాదులు తీసుకునేందుకు త్వరలో టోల్‌ఫ్రీ ఏర్పాటు చేస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఆఫీసర్లను సస్పెండ్చేసేందుకు వెనుకాడబోమని మేయర్హెచ్చరించారు. త్వరలో ఫుడ్‌సేఫ్టీ అధికారులతో రివ్యూ నిర్వహిస్తామని తెలిపారు.