అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్లు చదువుకొంటుండగా, వారి కోసం ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం వండి పెట్టేందుకు ఓ వంట మనిషి కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్‌కోసం నెలకు రూ.లక్ష పైగా ఖర్చు చేస్తోంది.
నెమలిపేట బడిలో గతేడాది 10 మంది స్టూడెంట్లు ఉండగా, 8 మంది 5వ తరగతి పూర్తిచేసి హైస్కూల్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక బాలిక, బాలుడు ఉన్నారు. మూడు, నాలుగో తరగతి చదువుతున్నారు. కొన్నాళ్ల కింద ఇక్కడి టీచర్లలో ఒకరు డిప్యూటేషన్‌పై అనంతారం వెళ్లారు. ప్రస్తుతం ఒక టీచర్.. ఇద్దరు స్టూడెంట్లకు పాఠాలు చెబుతున్నారు. మారుమూల గ్రామం కావడంతో ఇక్కడి స్కూలుకు స్టూడెంట్లు రావడం లేదు.