![మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు టీనేజర్ల మృతి](https://static.v6velugu.com/uploads/2023/11/two-teenagers-lifes-ends--hit-by-an-rtc-bus-in-medak-district_4cV6RfWo2O.jpg)
మెదక్ (అల్లాదుర్గం), వెలుగు: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలో 161 నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై రాంపూర్ బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 ఏండ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పిట్లం వెళ్లే క్రమంలో రాంపూర్ బ్రిడ్జి సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల దగ్గర బ్రిడ్జి కింద నుంచి వస్తున్న బైకును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న సీతానగర్ గ్రామానికి చెందిన శివసాయి (14), అజయ్ (14 ) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయ్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు అద్దాలు ధ్వంసంప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోయిన విషయం తెలుసుకున్న సీతానగర్గ్రామస్తులు సంఘటన స్థలానికి తరలివచ్చారు. ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన బస్సును ధ్వంసం చేశారు.
నేషనల్ హైవేను గంటసేపు బ్లాక్ చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో పోలీసులు వచ్చి వారిని శాంతింపజేశారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మృతుల కుటుంబాలను పరామర్శించారు.