పోలీస్ స్టేషన్లో మందు కొట్టిన కానిస్టేబుల్స్.. ఉద్యోగాలు ఊస్ట్.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన

పోలీస్ స్టేషన్లో మందు కొట్టిన కానిస్టేబుల్స్.. ఉద్యోగాలు ఊస్ట్.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన
  • ఇద్దరు కానిస్టేబుల్స్​ సస్పెన్షన్​
  • మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు
  • పీఎస్లోనే మద్యం తాగినట్లు ఆరోపణలు

మహబూబాబాద్: పోలీస్‌ స్టేషన్‌లో లిక్కర్​ తాగిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్‌ బయట వ్యక్తులతో కలిసి పీఎస్​పైన విశ్రాంతి గదిలో మద్యం సేవించారు. దీనిపై పోలీస్‌ శాఖ విచారణ చేపట్టింది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపగా..  ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.