
ప్రపంచంతో పోటీ పడి ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలో సీట్లు సంపాదించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లారు. ‘‘IIT లో చదువుతున్నారు.. బంగారు భవిష్యత్తు వీళ్ల సొంతం’’ అని తల్లిదండ్రులు అనుకున్నారు. తమకు గర్వకారణం అని గ్రామస్తులు భావించారు. కానీ చివరికి ఇందరి ఆశలను ఆవిరి చేస్తూ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది.
వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ మాదాల.. అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. శనివారం (మార్చి 29) ఐదంతస్తుల హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సూసైడ్ కు ముందు ‘‘నాన్నా తమ్ముడిని బాగా చూసుకో’’ అంటూ తల్లికి మెసేజ్ చనిపోయినట్లు చెబుతూ కన్నీరుమున్నీరు అయ్యారు.
కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణ, స్వర్ణలత దంపతులు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణ పురంలో నివాసం ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు రాహుల్ జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 52 ర్యాంక్ సాధించి.. అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో విద్యార్థి అఖిల్ (21) అదే రాత్రి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అఖిల్.. శనివారం (మార్చి 29) గుండెపోటుతో చనిపోయినట్లు ట్రిపుల్ ఐటీ యాజామన్యం తెలిపింది. మాడ్గులకు చెందిన కాట్రావత్ రాజూనాయక్, దేవి దంపతుల కుమారుడు అఖిల్ (21). చదువులో చిన్నప్పటి నుంచీ చురుకుగా ఉండేవాడని, ఇప్పుడు తమ కొడుకు లేడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నామని వాపోతున్నారు తల్లిదండ్రులు.