పైచదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు.. దొంగతనం చేస్తూ అక్కడి పోలీసులకు చిక్కారు. పట్టుబడిన ఇద్దరు అమ్మాయిలు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. ఒకరిది హైదరాబాద్ కాగా, మరోకరిది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. షాప్ లిఫ్టింగ్ కింద వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్ లిఫ్టింగ్ అనేది దొంగతనంలో ఇదో రకమైన మోసం. కొన్ని వస్తువులకు బిల్లు చెల్లించి.. మరికొన్ని సిబ్బంది కంటపడకుండా నొక్కేయడం అన్నమాట.
అసలేం జరిగిందంటే..?
20, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు భారత విద్యార్థులు గత నెల 19న(మార్చి) న్యూజెర్సీలోని హోబోకెన్ లో ఓ దుకాణంలో షాపింగ్ కు వెళ్లారు. అక్కడ కొన్ని వస్తువులను ఎంపిక చేసుకొని వాటికి బిల్లు చెల్లించారు. మరికొన్నింటిని సిబ్బంది కంటపడకుండా నొక్కేశారు. దీనిని గమనించిన షాప్ యాజమాని హోబోకెన్ పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడికి పోలీసులు.. సీసీ పుటేజీలను పరిశీలించి దొంగతనం జరిగినట్లు నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిలో ఒక విద్యార్థి అసలు ధరకు రెట్టింపు చెల్లిస్తామన్నా పోలీసులు విడిచిపెట్టలేదు. క్షమాపణలు చెప్పి, చెల్లించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు అక్కడి నిబంధనలు వివరించి అరెస్టు చేశారు. ఈ ఘటన మార్చి 19న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Two Telugu girls arrested for ‘shoplifting’ in US
— Sudhakar Udumula (@sudhakarudumula) April 18, 2024
They offered double payment and pleaded against repeating the offence.
Two indian students one from Hyderabad and one from Guntur pursuing their studies in New Jersey USA were arrested by the police in an alleged shoplifting… pic.twitter.com/OkrDM6CvSa