- ఫొటోలు తీస్తుండగా నదిలో పడిపోయిన యువకులు
- స్కాటిష్ జలపాతం నుంచి డెడ్‌బాడీలు వెలికితీసిన అధికారులు
లండన్: స్కాట్లాండ్లో చదువుతున్న ఇద్దరు తెలుగు స్టూడెంట్లు ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన వారు ఫోటో తీసేందుకు ప్రయత్నిస్తూ నీళ్లలో పడిపోయారని అధికారులు తెలిపారు. స్కాట్లాండ్లో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
ఫొటోలు తీస్తూ జారి పడి..
తెలుగు రాష్ట్రాలకు చెందిన కరుకూరి జితేంద్రనాథ్(26), బొలిశెట్టి చాణక్య(22) స్కాట్లాండ్లోని డూండీ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇంకో ఇద్దరితో కలిసి గురువారం బ్లెయిర్ అథోల్లోని లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం చూసేందుకు వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో ఫొటోలు తీస్తుండగా జితేంద్రనాథ్, చాణక్య ఇద్దరూ నదిలో పడి కొట్టుకుపోయారు. మిగతా ఇద్దరు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. ఇద్దరి డెడ్‌బాడీలను పోలీసులు వెలికితీసినట్లు లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ తెలిపింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం మనదేశానికి పంపించనున్నట్లు వెల్లడించింది. జితేంద్రనాథ్, చాణక్య ఇద్దరూ డూండీ వర్సిటీలో డేటా సైన్స్, ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. జితేంద్ర గతంలో అమెరికాలోని కనెక్టికట్ వర్సిటీలో చదివినట్లు తెలుస్తోంది. చాణక్య హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదివాడు. కాగా, వీళ్లిద్దరి మృతిపై డూండీ వర్సిటీ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిన్సియర్ స్టూడెంట్లను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.