జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. బుధవారం (ఏప్రిల్ 23) బారాముల్లాలోని ఉరి సెక్టార్ దగ్గర నియంత్రణ రేఖను దాటి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదులనుంచి భారీస్థాయిలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

మంగళవారం పహల్గామ్ లో టెర్రరిస్టుల దాడి తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది. బారాముల్లాలోని ఉరి నాలా దగ్గర సర్జీవన్ జనరల్ ఏరియా ద్వారా ముగ్గురు ఉగ్రవాదులు భారత్ తో చొరబడేందుకు ప్రయత్నించారు వారిని ఆర్మీ ఎన్ కౌంటర్ చేసింది. బారాముల్లా ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతాదళాలు తెలిపారు.