జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని రైనావరి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. ఆ ఇద్దరు లష్కరే తోయిబా టెర్రరిస్టు గ్రూప్‌కు చెందిన వాళ్లని జమ్ము కశ్మీర్ పోలీసులు గుర్తించారు. అనేక టార్గెటెడ్ హత్యలు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడిన కేసుల్లో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మృతులు రయీస్ అహ్మద్ భట్, హిలాల్ అహ్ రాహ్ గా గుర్తించామన్నారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
One of the killed categorised local #terrorists of proscribed #terror outfit LeT was carrying Identity Card (ID) of media. It indicates a clear case of misuse of media: IGP Kashmir@JmuKmrPolice pic.twitter.com/av3cnyRA8f
— Kashmir Zone Police (@KashmirPolice) March 29, 2022
రయీస్ అహ్మద్ భట్ అనంతనాగ్ లో గత ఏడాది నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కు పాల్పడుతున్నాడని కశ్మీర్ పోలీసులు చెప్పారు. అతడిపై ఇప్పటికే రెండు ఉగ్రవాద నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు తెలిపారు. అయితే అహ్మద్ భట్ డెడ్‌బాడీ దగ్గర ఒక ప్రెస్ ఐడీ కార్డు దొరికిందని, ఎంక్వైరీ చేయగా అతడికి మీడియాతో ఎటువంటి సంబంధం లేదని తేలిందని, అది ఫేక్ ఐడీ కార్డు అని పోలీసులు వివరించారు. ఇక మరో టెర్రరిస్ట్ హిలాల్‌ను బిజ్‌బెహరా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించామన్నారు. అతడొక సీ కేటగిరీ టెర్రరిస్ట్ అని చెప్పారు.