తాళం వేసిన ఇండ్లలో చోరీలు.. ఇద్దరు అరెస్ట్

తాళం వేసిన ఇండ్లలో చోరీలు..  ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: తాళం వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్ కు చెందిన కిషోర్, ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన భరత్ ఈజీమనీ కోసం చోరీలు మొదలుపెట్టారు. పగలు రెక్కీ నిర్వహించి, రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలు పాల్పడుతున్నారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో 150కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ హెచ్ఓ బి.లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి వెండి నగలు, ఒక హోండా యాక్టివా, రెండు కెమెరా లెన్స్​లు, రెండు వాచ్ లు, రెండు  మొబైల్స్  స్వాధీనం చేసుకున్నారు.  వీటి విలువ రూ.4.60 లక్షలు ఉంటుందన్నారు.